AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సెమీస్‌లోకి దక్షిణాఫిక్రా.. న్యూజిలాండ్‌పై 190 పరుగుల తేడాతో ఘన విజయం..

దక్షిణాఫ్రికా జట్టు సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్నది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టును ప్రొటీస్‌ జట్టు 190 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 357 పరుగులు సాధించింది. ఓపెనర్లు సెంచరీలతో కదం తొక్కారు. ప్రొటీస్‌ ఓపెనర్‌ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 118 బంతుల్లో 133 పరుగులు చేశాడు. క్వింటన్‌ డికాక్‌ 116 బంతుల్లో 114 పరుగులు చేశాడు. డెవిడ్‌ మిల్లర్‌ 53 (30 బంతులు) అత్యధికంగా పరుగులు చేశారు.

భారీగా పరుగులు సమర్పించిన బౌలర్లు.. తడబడ్డ బ్యాటర్లు..
న్యూజిలాండ్‌ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. టిమ్‌ సౌథి, బౌల్ట్‌ సహా అందరూ బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సౌథి 2 వికెట్ల తీసి 77 పరుగులు ఇచ్చాడు. బౌల్ట్‌ ఒక వికెట్‌ పడగొట్టి 49 పరుగులు సమర్పించుకున్నాడు. జేమ్స్‌ నీషమ్‌ బౌలింగ్‌ను ప్రొటీస్‌ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. 5.3 ఓవర్లలో నీషమ్‌ ఒక వికెట్‌ పడగొట్టి 69 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ జట్టు ఏమాత్రం బ్యాట్‌ను ఝుళిపించలేకపోయారు. ఓపెన్‌ కాన్వే ఆరు బంతులాడి రెండు పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. న్యూజిలాండ్‌ ఆటగాళ్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌ 60 (50), విల్‌యంగ్‌ 33 (37), డారిల్ మిచెల్ 24 (30) పరుగులు అత్యధికంగా పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లు కేశవ్‌ మహరాజ్‌కు నాలుగు వికెట్లు కూల్చగా.. జాన్‌సెన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. గెరాల్డ్ కోయెట్జీకి రెండు, రబాడకు ఒక వికెట్‌ దక్కింది.

ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్‌పై భారీ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో మొదటిస్థానానికి చేరింది. 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. మరో వైపు న్యూజిలాండ్‌ జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది. ఆడిన ఏడు మ్యాచుల్లో మూడింట్లో ఓటమిపాలైంది. మొదట వరుస నాలుగు విజయాలతో దూసుకెళ్లిన జట్టు.. చివరి మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ప్రస్తుతం జట్టు ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నది. జట్టు సెమీస్‌కు చేరాలంటే మిగతా రెండు మ్యాచుల్లో గెలవాలి. లేకపోతే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. న్యూజిలాండ్‌ ఈ నెల 4న పాక్‌, 9న శ్రీలంకతో తలపడనున్నది. మరోవైపు దక్షిణాఫ్రికా చివరి రెండు మ్యాచ్‌లను భారత్‌తో 5న, ఆఫ్ఘనిస్థాన్‌తో నవంబర్ 10న మ్యాచ్‌లు ఆడనున్నది.

ANN TOP 10