AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!

తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన కీలక ప్రక్రియ ప్రారంభమైంది. రాబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) అధికారికంగా ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన జనరల్, ఒకేషనల్ విభాగాల పరీక్షల తేదీలను బోర్డు కార్యదర్శి కె.ఆర్. అభిలాష్ అభినవ్ వెల్లడించారు.

ఈ షెడ్యూల్ ప్రకారం థియరీ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమై మార్చి 20 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. థియరీ కంటే ముందే ప్రాక్టికల్ పరీక్షల ప్రక్రియ పూర్తవుతుంది.

పరీక్షల పూర్తి షెడ్యూల్ జాబితా:

అసెస్‌మెంట్ మరియు ప్రాక్టికల్ పరీక్షల వివరాలు:
20-01-2027 నుంచి 25-01-2027 వరకు: ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలు
27-01-2027 (బుధవారం): ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష (ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు)
29-01-2027 (శుక్రవారం): ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష (ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు)
29-01-2027 (శుక్రవారం): ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్
30-01-2027 (శనివారం): సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్
01-02-2027 నుంచి 10-02-2027 వరకు: ఇంటర్ సెకండ్ ఇయర్ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ (ఆదివారాలతో సహా రోజూ రెండు సెషన్లలో – ఉదయం 9.00 నుంచి 12.00 వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 వరకు)
11-02-2027 నుంచి 18-02-2027 వరకు: ఇంటర్ ఫస్ట్ ఇయర్ సైన్స్ విద్యార్థులకు నూతన విధానంలో ప్రాక్టికల్స్ (మూడు సెషన్లలో – ఉదయం 9.00 నుంచి 11.00 వరకు, మధ్యాహ్నం 12.00 నుంచి 2.00 వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 వరకు)

ఇంటర్ ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షల జాబితా (సమయం: ఉదయం 9.00 నుంచి 12.00 వరకు)
24-02-2027 (బుధవారం): సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
26-02-2027 (శుక్రవారం): ఇంగ్లీష్ పేపర్-1
02-03-2027 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేపర్-1A / బోటనీ పేపర్-1 / పొలిటికల్ సైన్స్ పేపర్-1 / అకౌంటెన్సీ పేపర్-1 (ACE గ్రూప్)
05-03-2027 (శుక్రవారం): మ్యాథమెటిక్స్ పేపర్-1B / జువాలజీ పేపర్-1 / హిస్టరీ పేపర్-1 / కామర్స్ పేపర్-1 (ACE గ్రూప్)
09-03-2027 (మంగళవారం): ఫిజిక్స్ పేపర్-1 / ఎకనామిక్స్ పేపర్-1
15-03-2027 (సోమవారం): కెమిస్ట్రీ పేపర్-1 / కామర్స్ & అకౌంటెన్సీ పేపర్-1
17-03-2027 (బుధవారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1 / మ్యాథమెటిక్స్ పేపర్-1 (MEC గ్రూప్ కోసం సింగిల్ పేపర్) / మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1 / జియోగ్రఫీ పేపర్-1
19-03-2027 (శుక్రవారం): బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-1 (BiPC విద్యార్థుల కోసం)

ఇంటర్ సెకండ్ ఇయర్ థియరీ పరీక్షల జాబితా (సమయం: ఉదయం 9.00 నుంచి 12.00 వరకు)
25-02-2027 (గురువారం): సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
27-02-2027 (శనివారం): ఇంగ్లీష్ పేపర్-2
03-03-2027 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేపర్-2A / బోటనీ పేపర్-2 / పొలిటికల్ సైన్స్ పేపర్-2
08-03-2027 (సోమవారం): మ్యాథమెటిక్స్ పేపర్-2B / జువాలజీ పేపర్-2 / హిస్టరీ పేపర్-2
12-03-2027 (శుక్రవారం): ఫిజిక్స్ పేపర్-2 / ఎకనామిక్స్ పేపర్-2
16-03-2027 (మంగళవారం): కెమిస్ట్రీ పేపర్-2 / కామర్స్ & అకౌంటెన్సీ పేపర్-2
18-03-2027 (గురువారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2 / మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2 / జియోగ్రఫీ పేపర్-2
20-03-2027 (శనివారం): బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-2 (BiPC విద్యార్థుల కోసం)

ఒకేషనల్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ పరీక్షలు పైన పేర్కొన్న తేదీల్లోనే జరుగుతాయని బోర్డు స్పష్టం చేసింది. అయితే, ఒకేషనల్ కోర్సుల థియరీ పరీక్షల సబ్జెక్టుల వారీ కాలపట్టికను త్వరలోనే ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ తాత్కాలికమైనదని, పూర్తి వివరాలతో కూడిన సబ్జెక్టుల వారీ సమగ్ర టైమ్‌టేబుల్ బోర్డు అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంటుందని బోర్డు కార్యదర్శి తెలిపారు.

ANN TOP 10