AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘నా పోరాటం బీఆర్ఎస్ కార్యకర్తలపై కాదు’.. రాములమ్మ ఆసక్తికర ట్వీట్

మాజీ ఎంపీ, బీజేపీ కీల నేత విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. తన రాజకీయ జీవితంపై భావోద్వేగంగా స్పందించారు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఏనాడూ ఏ పదవీ కోరుకోకున్నా, ఇప్పటికీ అనుకోకున్నా ఈ పరిస్థితే ఎదురవుతోందని అన్నారు. అప్పుడు ఇప్పుడూ సంఘర్షణ మాత్రమే ఎదురైందని అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

’25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం, అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది. ఏ పదవి ఏనాడు కోరుకోకున్నా… ఇప్పటికీ పదవుల గురించి అనుకోవటం లేదు. అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం. మన పోరాటం నాడు దశాబ్దాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప.. ఇయ్యాల్టి బీఆర్ఎస్‌కు వ్యతిరేకం అవుతాం అని కాదు.

నా పోరాటం నేడు కేసీఆర్ గారి కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప, నాతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు. రాజకీయపరంగా విభేదించినప్పటీకి అన్ని పార్టీల తెలంగాణ బిడ్డలు అందరూ సంతోషంగా, సగౌరవంగా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం.. ఎప్పటికీ. హర హర మహాదేవ్. జై తెలంగాణ’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.

ANN TOP 10