AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతు బంధు ఇస్తాం.. రైతు భరోసా ఇస్తాం : రాహుల్ గాంధీ

తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తెలంగాణను కేసీఆర్ ఆయన కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొత్తు కేసీఆర్ కుటుంబసభ్యులకే చేరుతోందన్నారు. రెవెన్యూ, ఇసుక, మద్యం ఇలా అన్ని శాఖలు ఆ కుటుంబం వద్దే ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజా తెలంగాణ కోసం మనం పోరాడాం, దొరల తెలంగాణ కోసం కాదు అని రాహుల్ అన్నారు. పాలమూరు ప్రజాభేరి పేరుతో కొల్లాపూర్ లో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ ఎన్నికలు ప్రజల తెలంగాణ…దొరల తెలంగాణ మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

పథకాలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటిదేమీ జరగదన్నారు. పైగా తమ ప్రభుత్వం వస్తే రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. టిక్కెట్ల విషయంలో ఢిల్లీలో సీఈసీ భేటీ ఉన్నప్పటికీ తాను ఈ సభకు వచ్చానన్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం.. మరోవైపు తెలంగాణ సమాజం, నిరుద్యోగులు ఉన్నారన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ సొమ్మును దోచేశారన్నారు. లక్షల కోట్ల సొమ్మును పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారన్నారు. తన సోదరి ప్రియాంక గాంధీ అనారోగ్యం దృష్ట్యా తాను ఈ సభకు వచ్చానని చెప్పారు.

మాది రాజకీయ బంధం కాదు కుటుంబ బంధం. ఇందిరా గాంధీకి అత్యవసర పరిస్థితి వస్తే తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారు. ఈ నిజాన్ని నేను ఎప్పటికీ మరవలేను. మీ పోరాటాన్ని చూసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. అన్ని వర్గాలకు తెలంగాణ ప్రయోజనాలు దక్కుతాయని ఆశించాం. కేవలం ఒకే కుటుంబం ఆ ప్రయోజనాలన్నీ అనుభవిస్తోంది. మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేస్తాం” అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

ANN TOP 10