తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు మారే నాయకుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్(Congress) నుంచి బీఆర్ఎస్(BRS)కు..బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ జిలానీలు పెరుగుతున్నారు. 4-5రోజుల క్రితం జనగామలో కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య బాటలోనే మరో సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి పయనిస్తున్నారు. నాగర్ కర్నూల్ టికెట్ తనకు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడిన నాగం జనార్దన్‌రెడ్డిని బీఆర్ఎస్ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ కలిశారు. ఈసందర్భంగా నాగం జనార్దన్‌రెడ్డితో కేటీఆర్, హరీష్‌రావు. కాసేపు చర్చలు జరిపారు. అనంతరం బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. తాను త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరుతానని..సీఎం కేసిఆర్‌ని కలిసిన తర్వాత ముహుర్తం నిర్ణయించుకొని చేరిక తేదిని ఖరారు చేస్తానని నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపుపై సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్నా వారిని కాదని..ఒకటి , రెండ్రోజుల క్రితం పార్టీలో చేరిన వారికి టికెట్‌లు కట్టబెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ ను కాంగ్రెస్ తనకు ఇస్తుందని భావించిన నాగం జనార్దన్‌రెడ్డికి పార్టీ హైకమాండ్ మొండి చేయిచూపడంతో పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన నాగం జనార్దన్‌రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్‌రావు కలిశారు. బీఆర్ఎస్‌లో చేరాలని కోరారు. దీనిపై నాగం జనార్ధన్‌రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నాగర్ కర్నూల్ భవిష్యత్ కోసం బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.









