తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటివరకూ 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు వారు జిల్లాల్లో తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. త్వరలో మేనిఫెస్టో రిలీజ్ చేయనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏయే అంశాలు, హామీలు ఉండాలి అనే దానిపై చర్చించి, ఫైనల్ చేసేందుకు పీసీసీ ప్రత్యేకంగా మేనిఫెస్టో కమిటీని ఏర్పాటుచేసింది. మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం ఈ కమిటీ జిల్లాల్లో తిరిగింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంది. యువత, రైతులు, సంఘాలు, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారినీ కలిసి అభిప్రాయాలు తెలుసుకుంది. తదనుగుణంగా మేనిఫెస్టోని రూపొందిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పథకాలు అమలు కోసం అప్పులు చేస్తోందనీ, ప్రభుత్వ భూములు అమ్మేస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది.









