AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నల్లగొండ, నకిరేకల్ నాకు రెండు కళ్లు

నల్లగొండ, నకిరేకల్ తనకు రెండు కళ్ల లాంటివని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈసందర్భంగా కోమటిరెడ్డి వీుడియాతో మాట్లాడుతూ..‘ నకిరేకల్ నేతల ముందు ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మేము దగ్గరుండి గెలిపిస్తే.. మమ్మల్ని దారుణంగా మాట్లాడుతున్నాడు. మేము ఫస్ట్ జెడ్పీటీసీ‌గా గెలిపిస్తే.. పెద్ద పదవి ఎందుకు అని అన్నాడు. తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించాం.. ఒకటి కాదు రెండుసార్లు గెలిపించాను.ఇప్పుడు ఇష్టమున్నట్లు మాట్లాడుతుండు. నకిరేకల్‌లో రేపటి నుంచి ప్రచారం చేయండి. వేముల వీరేషంను గెలిపిద్దాం.. కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేయండి.

వీరేశంకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తా. ఎన్నాళ్లు నకిరేకల్‌లో పార్టీని బతికించిన వారిని నేను చూసుకుంటా. ఎవరూ అధైర్యపడొద్దు. ఈసందర్భంగా కోమటిరెడ్డి సీఎం.. సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యకర్తలను కోమటిరెడ్డి. వారించారు. నకిరేకల్‌లో వీరేశంను గెలిపిస్తే.. సీఎం అయినంత సంతోషిస్తా. కాంగ్రెస్‌లో ఎవరు సీఎం అయినా.. ప్రజలకు అందుబాటులో ఉంటారు. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సూర్యాపేటలో ఈసారి మంత్రి జగదీష్‌రెడ్డికి డిపాజిట్ కూడా రాదు. ఉమ్మడి నల్గొండలో 12కు 12 స్థానాలు కాంగ్రెస్ గెలవబోతుంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ANN TOP 10