ఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంకా జ్వరంతోనే బాధపడుతున్నారు. గతవారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న గులాబీ బాస్.. ఇంకా జ్వరం నుంచి కోలుకోలేదు. దీంతో శుక్రవారం నాడు (సెప్టెంబర్-29న) జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. అయితే మళ్లీ ఎప్పుడు సమావేశం ఉంటుందనే విషయంపై క్లారిటీ లేదు. అక్టోబర్ మొదటివారంలో కేబినెట్ భేటీ ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఒకవేళ కేబినెట్ భేటీ జరిగి ఉంటే.. పలు కీలక విషయాలపై చర్చించాలని కేసీఆర్ భావించారు. ముఖ్యంగా.. అక్టోబర్ రెండోవారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీనిపై ప్రధానంగా చర్చ జరిగేది. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై కూడా నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావించినట్లు తెలియవచ్చింది. అంతేకాకుండా గవర్నర్ తమిళిసై.. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగేది. అంతేకాదు.. వేరేవారిని నామినేట్ చేయాలా? లేదా గవర్నర్ నిర్ణయంపై న్యాయపరంగా ముందుకెళ్లాలా? అనే దానిపై చర్చ జరిగేదని తెలుస్తోంది. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తమిళిసై తిరస్కరించడంపెద్ద వివాదానికే దారి తీసింది. దీనిని బీఆర్ఎస్ పెద్దలు తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా తమిళిసై టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు.









