AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టికెట్‌ రానివారికి పార్టీలో సముచిత స్థానం

పోటీ చేస్తామన్న అందరికీ టిక్కెట్లు ఇవ్వలేం … అలా అని నిరుత్సాహపడే వారికి పార్టీలో సముచిత న్యాయం చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మధుయాష్కి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుల సమావేశం ఢిల్లీ వార్ రూమ్‌లో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మరోసారి సమావేశం కానున్నట్లు తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కి తెలిపారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళి ధరన్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు. మురళి ధరన్ పార్లమెంట్‌‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్‌లో ఉన్నారని.. దీంతో రేపు మరోసారి భేటీ అవుతామని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు చెప్పారు. మురళి ధరన్ పార్లమెంట్‌‌‌కు వెళ్లాల్సి ఉండడంతో స్క్రీనింగ్ కమిటీ సమావేశం మధ్యలో ఆగిందని సభ్యులు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై ఒక కొలిక్కి వచ్చినట్లు చెప్పారు.

ANN TOP 10