కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖమ్మం చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో రైతు ఘోష – బీజేపీ భరోసా బహిరంగ సభ ప్రారంభం కానుంది. సభా ప్రాంగణానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. అమిత్ షాకు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానశ్రయంలో ఆయనకు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్వాగతం పలికారు. రైతు గోస.. బీజేపీ భరోసా బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభలోనే అమిత్ షా రైతు డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. అయితే ఈ సభలో అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.









