సమంత గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. సమంత ఇటీవల శాకుంతలం అనే చిత్రంతో పలకరించారు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత వైద్య చికిత్స కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి తాజాగా కొన్ని ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలను చూస్తుంటే సమంత మరింత స్లిమ్‌గా, కొద్దిగా చిక్కిపోయినట్లు కనిపిస్తున్నారు.










