AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళ అభిమానానికి ఏసీపీ ఫిదా..

హైదరాబాద్‌లో గుండెలకు హత్తుకునే సన్నివేశం..
తొమ్మిదేళ్ల క్రితం తనకు సాయం చేసి ప్రాణాలు నిలబెట్టిన ఓ పోలీసును గుర్తుపెట్టుకుని మరీ.. కృతజ్ఞతలు చెప్పింది. బస్సులో వెళ్తుంటే చూసి గుర్తుపట్టి.. పరుగు పరుగున వచ్చి తన గుండెల నిండా నింపుకున్న అభిమానాన్ని చాటుకుంది. ప్రస్తుతం మహంకాళి ఏసీపీగా ఉన్న రవీందర్… 2014 సంవత్సరంలో టప్పాచపుత్ర ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో.. కార్వాన్‌కు చెందిన కవిత అనే మహిళా రోడ్డుపై అనారోగ్యంతో భాధపడుతుండటాన్ని చూసి చలించిపోయారు. తన సొంత డబ్బులతో కవితను ఆస్పత్రిలో చేర్పించి.. ఆపరేషన్ కూడా చేయించారు. దీంతో.. ఆమె మామూలు మనిషి అయిపోయింది. అయితే.. అప్పటి నుంచి తనకు సాయం చేసిన ఆ పోలీసు మళ్లీ కనబడలేదు. కట్ చేస్తే.. ఈరోజు బస్సులో వెళ్తున్న కవిత.. కిటికీలోంచి చూడగా ఏసీపీ కనిపించారు.

బస్సు ఆపమని డ్రైవర్‌ను అడిగించి.. కొంచెం స్లో చేయగానే రన్నింగులోనే బస్సు దిగి.. పరుగెత్తుకుంటూ ఏసీపీని చేరుకుంది. ఇన్నేళ్లను తన ప్రాణాన్ని కాపాడిన పోలీసును మళ్లీ కలవటం పట్ల మాటల్లో చెప్పలేని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈరోజు తాను బ్రతికి ఉన్నానంటే కారణం ఏసీపీ రవీందరేనంటూ కన్నీరు పెట్టుకుంది. “అన్న నీ కోసం వెండి రాఖీ కొన్న.. వచ్చి కడుతాను..” అంటూ చెప్పింది. తన ప్రాణాలు నిలబెట్టిన ఈ పోలీసు.. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని.. ఇంకేంతో మందికి సాయం చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. అయితే.. ఆ మహిళ ఫోన్‌లో ఉన్న ఏసీపీ ఫోటో చూసి ఆమె కృతజ్ఞతకు ఏసీపీతో పాటు అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఏసీపీ ఫోన్ నెంబర్ తీసుకోని ఆనందంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ANN TOP 10