తమిళ నటుడు సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సినిమా గజనితో తెలుగు వారి హృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు ‘గజని’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇక సూర్య లేటెస్ట్‌గా కంగువ అంటూ ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీతో వస్తున్నారు. అది అలా ఉంటే సూర్య ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. సూర్య, జ్యోతికలకు దియా (కూతురు) దేవ్ (కొడుకు) ఇద్దరు సంతానం.. సూర్య జ్యోతికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 11 సెప్టెంబర్ 2006 న జరిగింది.
ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. లేటెస్ట్‌గా కంగువ అంటూ ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీతో వస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై వావ్ అనిపించింది. ఊహకందని విజువల్స్‌తో ఫస్ట్ గ్లింప్స్ అబ్బురపరిచింది. అది అలా ఉంటే ఈ సినిమా కథ.. తెలుగులో ఆ మధ్య వచ్చిన బింబిసారకు దగ్గరగా ఉంటుందని టాక్ నడుస్తోంది.









