AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ

సమస్యలే లక్ష్యంగా ఆదివారం (నేడు )ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించతలపెట్టింది. ఈ సభకు హాజరవుతున్న కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. మరో మూడు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడం రాజకీయాలు రంజుగా మారాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా సభను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను వడబోస్తున్న నేపథ్యంలో ఆదివారం జరగబోయే సభలో అమిత్ షా ఏం మాట్లాడుతారు? ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా?. బీజేపీలోకి కొత్తగా ఏమైనా చేరికలు ఉంటాయా? అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ANN TOP 10