అధికార బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీకి నేడో, రేపో గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ను వీడాల్సిందేనన్న కచ్చితమైన నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. అయితే అక్కడ టికెట్‌పై పూర్తి స్పష్టత రాలేదని సమాచారం. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోనే ఉండి కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా ఖానాపూర్ టికెట్ ను ఈసారి మంత్రి కేటీఆర్ స్నేహితుడైన జాన్సన్ నాయక్‌కు కేటాయించారు. దీంతో ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్‌ఎస్‌ను వీడాలని నిర్ణయం తీసుకున్నారు.









