మంత్రి కేటీఆర్ తనయుడు కల్వంకుట్ల హిమాన్షు రావు ఉన్నత చదువుల కోసం అమెరికా పయనమయ్యాడు. ఇటీవల ఇంటర్మీడియట్‌ను పూర్తి చేసుకున్న హిమాన్షు.. ఉన్నత చదువుల కోసం శనివారం రాత్రి యూఎస్ బయలుదేరి వెళ్లారు. కేటీఆర్, తల్లి శైలిమ, చెల్లెలు అలేఖ్యతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఒకింత ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన నిన్నమెున్నటి వరకు అల్లరిగా తిరిగిన పిల్లాడు అప్పుడే పెద్దయి కాలేజీకి వెళ్తున్నాడంటే… నమ్మలేకపోతున్నానని అన్నారు. హిమాన్షు ఒంటిరిగా అమెరికా వెళ్లటం లేదని తనలోని సగ భాగాన్ని తీసుకెళ్తున్నాడని భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు హిమాన్షు చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు వివిధ సందర్భాల్లో తీసిన ఫోటోలను కేటీఆర్ ట్వీట్ చేశారు.









