సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించే సమంత.. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ సంగతులను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్ పలు అనుమానాలకు తెరలేపింది.
కొత్త ప్రేమ అంటూ ప్రారంభించి వాటర్ గ్లాసు చేత పట్టుకున్న పిక్ పంచుకుంది సమంత. కొత్త ఆంక్షలతో కొత్త ఆవిష్కరణలు.. కొత్త ప్రేమను కనుగొన్నా అంటూ లవ్ ఎమోజిస్ పెడుతూ పోస్ట్ చేసింది సామ్. దీంతో సమంత పోస్ట్ వెనకున్న ఆ ప్రేమ ఏంటి? సమంత మళ్లీ లవ్ లో పడిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.









