AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖానాపూర్‌ నుంచి బొజ్జు పటేల్‌?

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు గెలుపుగుర్రాలను త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి వెడ్మబొజ్జు పటేల్‌ ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా పార్టీ ఆదేశాల మేరకు ఆయన గ్రౌండ్‌ వర్క్‌ చేసుకుంటుండగా, సర్వేలలోనూ ఆయనకు మొగ్గు కనిపిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. బోథ్‌ నుంచి ఆడె గజేందర్‌ పేరు కూడా పార్టీ పరిశీలిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ని ఆదివారం వీరు కలిశారు. తెలంగాణ లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎనిమిది స్థానాలు కాంగ్రెస్‌ గెలవబోతున్నదన్నారు.

ANN TOP 10