ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… నగరం నడిబొడ్డున గిరిజన మహిళను పోలీసులు కొడితే.. సీఎంవోలో ఐఏఎస్ అధికారిణి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ఘటనలపై స్పందించే ట్విట్టర్ పిట్ట స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇతర రాష్ట్రాల్లో ఘటనలపై స్పందించే ట్విట్టర్ పిట్ట స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు ట్విట్టర్ పిట్టకు కన్పించడం లేదా అని నిలదీశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్, కవిత ఎందుకు స్పందించటం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సొంత నియోజకవర్గంలో మహిళకు జరిగిన అన్యాయం కంటే.. ఎమ్మెల్యే సీటే సబితా ఇంద్రారెడ్డికి ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే మహిళపై దాడి చేయటం బాధాకరమన్నారు. ఘటనకు బాధ్యులైన ఎస్‌హెచ్‌ఓ, పోలీసు ఉన్నతాధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సీసీ టీవీలు లేనప్పుడు.. రూ.1200 కోట్లతో కట్టిన కమాండ్ కంట్రోలు ఎందుకు అంటూ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.









