AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హుటాహుటిన అమెరికా వెళ్లిన సమంత!

సమంత గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. సమంత ఇటీవల శాకుంతలం అనే చిత్రంతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర డిజాస్టర్‌ అయ్యింది. ఇక ఆమె ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఖుషి అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలకానుంది. ఇది అలా ఉంటే సమంత అత్యవసరంగా అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.

ఖుషి ప్రమోషన్స్‌ ముగియడంతో సమంత మయోసైటిస్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు సమాచారం. అక్కడే మూడు నెలలపాటు చికిత్స తీసుకుంటారని సన్నిహితుల ద్వారా సమాచారం. ఆమె మయోసైటీస్‌ అనే కండరాల వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్‌ గ్యాప్‌ తీసుకోబోతుందట. ఈ విషయంలో సమంత స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

ANN TOP 10