AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 24 లోపల తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. భూకబ్జా కేసులో ఆయనకు సమన్లను పంపింది. వాస్తవానికి ఆగస్ట్ 14నే విచారణకు హాజరు కావాలని సొరేన్ ను ఈడీ ఆదేశించింది. అయితే, ఆనాటి విచారణకు ఆయన హాజరు కాలేదు. తనకు మరింత సమయం కావాలని అడిగారు. గతంలో మరో కేసులో ఈడీ విచారణకు సొరేన్ హాజరయ్యారు. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి రాంచీలోని ఈడీ కార్యాలయంలో ఆయనను 10 గంటల సేపు విచారించారు. మరోవైపు భూకబ్జా కేసులో 13 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. వీరిలో ఒక ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. జులై 8న సొరేన్ పార్టీ ఎమ్మెల్యే ప్రతినిధి నివాసంలో జరిపిన సోదాల్లో ఒక చెక్ బుక్ లభించింది. ఈ చెక్ బుక్ సీఎం బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయి ఉంది. దీంతో, ఈ కేసులో సొరేన్ ను కూడా చేర్చారు.

ANN TOP 10