కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని.. కానీ ఒంటరిగా వినిపించే స్వరం అణిచివేయబడుతుందన్నారు. వారందరి కోసమే సత్యాగ్రహ ప్లాట్ ఫామ్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డీఏ పాలనలో సత్యాన్ని అణచివేస్తున్నారని, దాన్ని అడ్డుకోవడం ప్రతిపక్ష నేతగా తన బాధ్యతన్నారు రాహుల్. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా ఎక్కడ నిరసన చేపట్టినా వాటిని ఈ పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.
తమ సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రజలు చేపడుతున్న నిరసనల్ని ఏకతాటిపైకి తెచ్చే లక్ష్యంతో ఈ డిజిటల్ వేదికను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ వేదిక ద్వారా అన్ని గళాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
మహాత్మాగాంధీ చెప్పినట్టు సత్యమే గొప్ప ఆయుధమన్నారు. సత్యంతో ఐక్యంగా కలిసి నిలబడటం అంతకంటే గొప్ప వెపన్ అన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారు సత్యాగ్రహ ప్లాట్ ఫామ్‌లో నమోదు చేసుకుంటే.. వారి గొంతును పార్లమెంట్ వరకు వినిపిస్తామన్నారు రాహుల్ గాంధీ.








