AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను తక్షణమే రద్దు చేయాలి..! మల్లికార్జున ఖర్గే షాకింగ్ కామెంట్స్..

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ, తీవ్రమైన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. దేశంలో జరిగిన ఎన్నికలన్నీ అక్రమమని ఆరోపిస్తూ, లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలోని కలబుర్గిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుత పాలన మొత్తం చట్టవిరుద్ధమైన ఎన్నికల పునాదిపైనే నడుస్తోందని ఆరోపించారు.

ఈవీఎంల దుర్వినియోగం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో జరుగుతున్న అవకతవకల కారణంగానే ఈ డిమాండ్ చేస్తున్నట్లు ఖర్గే స్పష్టం చేశారు. “ఈ రోజు దేశం మొత్తం అక్రమ ఎన్నికల ద్వారానే నడుస్తోంది. మోదీ అక్రమ ప్రధాని, అమిత్ షా అక్రమ మంత్రి అని, దేశంలో ఎన్నికైన ముఖ్యమంత్రులందరూ అక్రమంగా ఆ పదవుల్లో ఉన్నట్టేనని అన్నారు. వాటన్నింటినీ రద్దు చేసి, కేవలం బ్యాలెట్ పత్రాలతోనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి” అని చెప్పారు.

ఈ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో పాటు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కూడా చర్చించినట్లు ఖర్గే తెలిపారు. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించామని, అందులో భాగంగా అక్టోబర్ 6వ తేదీన ఢిల్లీలో విపక్ష ఎంపీలందరూ కలిసి ఎన్నికల సంఘం కార్యాలయానికి నిరసన ర్యాలీ నిర్వహిస్తారని వివరించారు. ఓటర్ల జాబితా నుంచి కొన్ని వర్గాల ప్రజల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై యువతలో చైతన్యం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

ANN TOP 10