AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్ ఖబడ్దార్ అంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫైర్

మంత్రి కేటీఆర్ ఖబడ్దార్ అంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ వార్నింగ్ ఇచ్చారు. నేడు గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ని ప్రజలు తరిమి తరిమి కొట్టకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు. తెలంగాణకి కాంగ్రెస్ ఏం చేసిందో మీ నాయనని అడగమని కేటీఆర్‌కి షబ్బీర్ చెప్పారు. పొలిటికల్‌గా కేసీఆర్‌కి జన్మనిచ్చింది కాంగ్రెస్ అన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్, షబ్బీర్ అలీ ఏం పీకారని కేటీఆర్ అనడం సిగ్గుచేటన్నారు. ఉద్యమం టైంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నాడని షబ్బీర్ అలీ తెలిపారు. తాను ఏం పీకానో అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారన్నారు.

కేసీఆర్ కుటుంబానికి ఉండడానికి ఇల్లు కూడా లేదని… ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారని షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ ఓఆర్ఆర్ వేస్తే.. బీఆర్ఎస్ నాయకులు సంపాదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భూములు అమ్మి ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ 100 రోజుల తరువాత ఎక్కడ ఉంటావో చూసుకోమన్నారు. కేటీఆర్ కి తగిన బుద్ధి త్వరలోనే చెబుతామన్నారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానంటే ఆయన ఇష్టమన్నారు. తాను కాంగ్రెస్ తరపున కామారెడ్డి నుండే పోటీ చేస్తున్నానని షబ్బీర్ అలీ తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10