వైద్యుల సూచనలతో రెస్ట్!
క్షణం తీరిక లేకుండా వరుస పర్యటనలు చేస్తున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. సోమవారం కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కాగా..వైద్యులను సంప్రదించారు. కాసేపు రెస్ట్ తీసుకోవాలని వారు చెప్పడంతో కేటీఆర్ గెస్ట్ హౌస్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి యథావిధిగా మళ్లీ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. కేటీఆర్ అస్వస్థతకు గురవడంతో అభిమానులు ఆందోళన చెందగా.. తిరిగి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
