బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఈ మధ్య ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బంగారం ధర అయితే తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది కానీ పెరగడమనేది అయితే ఈ మధ్య కాలంలో లేదనే చెప్పాలి. నేడు బంగారం ధర అయితే స్థిరంగా ఉంది. కానీ వెండి ధర ఊహించని స్థాయిలో తగ్గిపోయింది. నేడు వెండి ధర కిలోకి రూ. 3,200 తగ్గడం విశేషం. ఎలాగూ శ్రావణ మాసం వస్తోంది కాబట్టి కొనుగోలుదారులు బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో అస్సలు ఆలస్యం చేయకండి. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో తగ్గిన దాఖలాలైతే లేవు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620గా ఉంది. ఇక వెండి కిలో ధర రూ.73,000గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,200
విజయవాడలో కిలో వెండి ధర రూ.76,200
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,200
చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200