ఖుషీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు. ఇందులో భాగంగానే తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో విజయ్ దేవరకొండ ఒకరు. రౌడీ స్టార్ గా పిలవబడుతున్న ఈ యువ హీరో పెళ్లి మ్యాటర్ గత కొన్ని రోజులుగా డిస్కషన్ పాయింట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లిపై విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఒకప్పుడు తన వద్ద ఎవరూ పెళ్లి మాటే ఎత్తేవారు కాదని చెప్పిన విజయ్ దేవరకొండ.. ఈ మధ్య కాలంలో తన స్నేహితులు చాలా మంది పెళ్లి చేసుకున్నారని, వారి దాంపత్య జీవితాలను చూస్తుంటే తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలుగుతోందని అన్నారు. జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పిన విజయ్ దేవరకొండ.. తన వివాహ ఘడియలు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తన పెళ్లి విషయాన్ని ముందుగానే అందరికీ చెపుతానని కూడా చెప్పారు. దీంతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ అయింది.









