ఎం పిల్లో ఎం పిల్లాడో అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ప్రణీత సుభాష్. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ ప్రణీత అందానికి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా కంటే ముందు కన్నడ ఇండస్ట్రీలో పోకిరి అనే సినిమాలో నటించింది. ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వరస అవకాశాలను అనుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ప్రణీత చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ వైరల్ గా మారాయి.










