ఎంపీడీఓ ఆఫీసులో అడుగు పెట్టాలంటే భయం. ఎటు చుసిన పెచ్చులు కనబడుతుంటాయి. ఇప్పుడు వర్షాకాలం.. గోడలు కూలే ప్రమాదం ఉంది. ఉద్యోగులు ప్రాణాన్ని కాపా డుకోవడానికి .. హెల్మెట్ ధరిస్తున్నారు. సహజంగా బైక్ పై వెళ్ళే సమయం లో హెల్మెట్ ధరిస్తారు. కానీ.. ఈ ఆఫీస్ లో పని చేసి ఉద్యోగులు మాత్రం హెల్మెట్ ధరిస్తున్నారు.. ఈ ప్రభుత్వం ఆఫీస్ ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం 2016 లో ఏర్పడింది. అప్పటి నుంచి మండల కేంద్రం లో ఎంపీడీవో కార్యాలయం పాత భవనంలోనే కొనసాగుతోంది. భవనం శిథిలావస్థలో ఉండటంతో ఏడాది నుంచి పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. గత ఏడాది ఎంపీడీవో కూర్చుని ఉండగా ఆయన టేబుల్ పై పెచ్చులు ఊడి పడ్డాయి. అదృష్టవశత్తు ఆయనకు ఏమి కాలేదు.ఈ విషయాన్ని ఉన్నతాధికారుల కు చెప్పడం తో అప్పటి అదనపు కలెక్టర్ ఎంపీడీవో కార్యాలయాన్ని తరలించాలని తక్షణమే మార్చాలని ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఆదేశాలు అమలు కాలేదు. ఈ ఏడాదిలో రెండు సార్లు పెచ్చులు ఊడి పడ్డాయి.
మొన్నటి భారీ వర్షాలకు ఎంపీడీఓ ఆఫీస్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఇప్పుడు మళ్ళీ భారీ వర్షాలు కురిస్తే.. కూలిపోయే ప్రమాదం ఉంది. ఉన్నతా ధికారులు స్పందించి ఈ బిల్డింగ్ వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయాలనీ కోరుతున్నారు. లేదంటే.. ఉద్యోగం చేయడం కష్టమని వాపోతున్నారు. నిత్యం బయపడుకుంటూ పని చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హెల్మెట్ ధరించి ఆఫీస్ లో పని చేయడం ఇబ్బందిగా ఉన్నా ప్రాణాన్ని కపా డుకోవడం కోసమే తప్పడం లేదంటున్నారు ఇక్కడి సిబ్బంది.









