AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు ఇస్లాంపూర్‌లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా ఇస్లాంపూర్‌లో బుధవారం నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఎం పీ బీబీపాటిల్‌, మహారాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ ఇన్‌చార్జి కల్వకుంట్ల వంశీధర్‌రావు, మహారాష్ట్ర కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు మాణిక్‌కదమ్‌, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే తదితరులు హాజరుకానున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరిన ప్రముఖ షేత్కరి సంఘటన్‌ మహారాష్ట్ర అధ్యక్షుడు రఘునాథ్‌పాటిల్‌ ఆధ్వర్యంలో ఈ సభ జరుగనున్నది. ఈ సభ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షేత్కరి సంఘటన్‌ నేతలు, కార్యకర్తలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

ANN TOP 10