హస్తం అధిష్టానం కీలక నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గద్దర్ కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి నుంచి గద్దర్ తమ పార్టీ నేతగానే నేతలు భావిస్తూ వచ్చారు. అందులో భాగంగానే గద్దర్ మరణ వార్త తెలిసినప్పటి నుంచి అంత్యక్రియలు ముగిసే దాకా పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ,సీతక్క, వీహెచ్, మల్లం రవితో పాటు కాంగ్రెస్ నేతలంతా గద్దర్ కుటుంబ సభ్యుల వెంటే ఉండటం విశేషం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీ సంతాపంప్రకటించారు. రాష్ట్ర నేతలంతా చివరి వరకు గద్దర్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగినప్పుడు గద్దర్ పాల్గొన్న సందర్బాలు ఉన్నాయి. రాహుల్, ప్రియాంక గాంధీలు తెలంగాణ లో పర్యటించిన ప్రతి సారి గద్దర్ ఆయా సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పోరాటాలకు బాసటగా నిలిచారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల ఓటమి కాంగ్రెస్ తోనే సాధ్యమని గద్దర్ బలంగా నమ్మేవారు. అందుకే ఎక్కడ కాంగ్రెస్ మీటింగ్ జరిగినా అక్కడ గద్దరు ఉండేవారు. సీఎల్పీ నేత బట్టి పాదయాత్రలో సైతం గద్దర్ చాలా రోజులు వెంట నడిచారు. మరో వైపు గద్దర్ కుమారుడు సూర్య గత ఎన్నికలప్పుడు కాంగ్రెలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక అసెంబ్లీ సీటు టికెట్‌కు ఆయనకు దాదాపు ఖరారు చేశారు. కానీ అది చివరి నిమిషంలో మారింది. ఈసారైనా గద్దర్ కుమారుడికి టెకెట్ ఇవ్వాలని కాంగ్రెస్ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.









