AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చేనేత అందాలకు కేరాఫ్ స్మితా సబర్వాల్..

ఆరు గజాల చేనేత చీర కట్టుకున్న చెక్కిన శిల్పంలా కన్పిస్తుంటారు సీఎంవో ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్. తన హోదా పరంగానూ.. మరింత స్థాయిని పెంచే రీతిలో ఆమె కట్టూబొట్టు ఉంటుంది. అందులోనూ ఆమె వస్త్రాదారణ.. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఏ కార్యక్రమం అయినా సరే.. చేనేత వస్త్రాలే.. అందులోనూ ముఖ్యంగా గద్వాల చీరలు.. ధరించటం ఆమె స్పెషాలిటీ. కేవలం స్మితా సబర్వాలే కాదు.. ఆమె స్నేహితులైన ఐఏఎస్‌లు హరిచందన, శ్వేతా మహంతి కూడా చేనేత దుస్తుల్లోనే కన్పిస్తుంటారు. ఈ క్రమంలోనే.. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. హస్తకళాకారులు, చేనేత కార్మికులకు.. ఆ పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తును నేసిద్దామని స్మితా సబర్వాల్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.

ANN TOP 10