AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో విద్యార్థి మృతి..

బాసర ఐఐఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కళాశాలలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్ బాబ్లా అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బాయ్స్ హాస్టల్-1లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. తోటి విద్యార్థులు వెంటనే తలుపులు పగులగొట్టి కిందకు దించారు. వెంటనే కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడినుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బబ్లూ మృతి చెందాడు.

కాగా, బబ్లూ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో బబ్లూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే క్యాంపస్‌లో చదువుతున్న సోదరుడితో మధ్యాహ్నం వరకు మాట్లాడిన బబ్లూ ఆ తర్వాత కాసేపటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇలా చేశాడా.. లేక డిప్రెషన్ వల్లా.. ర్యాగింగ్ లాంటిదేమైనా ఉందా.. మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10