AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విజువల్ వండర్‌గా ‘పిజ్జా 3’

‘పిజ్జా 3’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కనెక్ట్‌ మూవీస్‌ ఎల్‌ఎల్పీ నిర్మాతలు ‘పిజ్జా3’ రైట్స్‌ని సొంతం చేసుకున్నారు. ఇటీవలే తమిళంలో విడుదలైన ‘పిజ్జా 3’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. అశ్విన్‌ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలలో మోహన్‌ గోవింద్‌ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పిజ్జా 3’ తమిళనాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయం సాధించింది.

ఈ చిత్రం తెలుగు రైట్స్‌ ని సొంతం చేసుకున్న కనెక్ట్‌ మూవీస్‌ ఎల్‌ఎల్పీ నిర్మాతలు త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘పిజ్జా 3’ విజువల్‌ వండర్‌.. ప్రేక్షకులకు థ్రిల్‌ తో పాటు గొప్ప థియేట్రికల్‌ అనుభూతిస్తుంది’’ అని తెలిపారు.

ANN TOP 10