కాంగ్రెస్ ఎంపిగా రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. మోడీ ఇంటిపేరును దుర్భాషలాడారని రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు ఆయనకు శిక్ష విధించడం, తరువాత ఆయన ఎంపి సీటుపై లోక్‌సభ స్పీకర్ వేటు వేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఊరట కల్పించిన నేపథ్యంలో తిరిగి ఎంపిసీటు దక్కింది. కేరళ వాయనాడ్ ఎంపిగా రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం అధికారిక ప్రకటన వెలువరించింది.
ఇప్పటి వరకూ అమలులో ఉన్న ఎంపి అనర్హత వేటు ఇక రద్దు అయినట్లే అని, ఆ తరువాతి న్యాయవిచారణలు, జుడిషియల్ తీర్పులను పరిశీలించి తదనంతర నిర్ణయాలు ఉంటాయని , తిరిగి ఇప్పుడు ఆయన ఎంపిగా చెల్లుబాటులోకి వచ్చినట్లే అని ఈ నోటిఫికేషన్‌లో తెలిపారు.









