AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్కాట్లాండ్ వీధుల్లో కుటుంబంతో కలిసి మహేష్ బాబు ఎంజాయ్‌

మహేష్ బాబు ఒకవైపు సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. తన కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబు అసలు సిసలు ఫ్యామిలీ మ్యాన్ అనే చెప్పాలి. తాజాగా ఈయన కాస్త రీ ఫ్రెష్ అవుదామని స్కాట్లాండ్‌కు వెళ్లారు. అక్కడ తన కుటుంబంతో గడిపిన సమయాన్ని మహేష్ బాబు నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

గుంటూరు కారం సినిమా షూటింగ్ గ్యాప్‌లోనే కుటుంబంతో కలిసి స్కాట్లాండ్‌లోని ఎడిన్ బర్గ్ క్యాస్టిల్‌ను సందర్శించారు. అక్కడ మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ కృష్ణ ఉన్నారు.

ANN TOP 10