AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ సర్కారుపై రేణుదేశాయ్ ఫైర్..

ఆక్వామెరైన్ పార్క్ తో ప్రకృతి విధ్వంసం
వద్దయ్యా.. వద్దు అంటున్న సదా

(అమ్మన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్)
కేసీఆర్ సర్కారుపై సినీనటి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఫైర్ అవుతున్నారు. సర్కారు నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. సినీ నటి, దర్శకురాలు, సోషల్ యాక్టివిస్ట్ అయిన రేణు దేశాయ్ హైకోర్టు మెట్లెక్కారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లో ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివార్లలోని కొత్వాల్ గూడలో ఆక్వా మెరైన్ పార్క్, పక్షిశాల ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటు చేయడం వల్ల ప్రకృతి విధ్వంసం జరుగుతుందంటూ హైకోర్టులో ఆమె ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మరికొందరు సెలబ్రిటీలతో కలిసి పోరాటం మొదలు పెట్టారు. ఆక్వా మెరైన్ పార్క్ ను ఆపాలంటూ పోరాడుతున్న వారిలో హీరోయిన్ సదా, శ్రీ దివ్య, డైరెక్టర్ శశికిరణ్ తిక్కా తదితరులు కూడా ఉన్నారు. ఆక్వామెరైన్ పార్క్ తో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని, దీనిని ఆపితీరాల్సిందేనని సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా గళమెత్తుతున్నారు.

ANN TOP 10