AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బిపాసా బసు కన్నీళ్లు .. కూతురి గుండెలో 2 రంధ్రాలు.. పుట్టిన మూడు నెలలకే హార్ట్ సర్జరీ

బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు గతేడాది నవంబర్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన కూతురికి దేవి అని నామకరణం చేశారు. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్, కూతురు దేవికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని తెలియజేస్తుంటారు. కానీ తాజాగా తన ఇన్ స్టాలో లైవ్ సెషన్ లో కన్నీరు పెట్టుకుంది. నేహా ధూపియాతో లైవ్ సెషన్ లో పాల్గొన్న బిపాసా.. తన కూతురు దేవి గుండెలో 2 రంధ్రాలు ఉన్నాయని చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. కేవలం 3 నెలల వయసులోనే తన కూతురి గుండెలో 2 రంధ్రాలు ఉన్నాయని.. ఆ చిన్నారికి వైద్యులు ఎలా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చిందో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

తనకు పాప పుట్టిన మూడవ రోజే ఈ షాకింగ్ విషయం తెలిసిందని.. అయితే ఎవరికీ దీని గురించి చెప్పుకోకూడదని అనుకున్నామని.. కానీ ఈ ప్రయాణంలో తనకు సాయం చేసిన తల్లులు చాలా మంది ఉన్నారని భావిస్తున్నట్లు తెలిపింది. “పాప గుండెకు రంధ్రాలు ఉన్నాయని మాకు మూడు రోజుల తర్వాత తెలిసింది. చిన్నారి నయం అవుతుందో లేదో తెలుసుకోవడానికి ప్రతి నెల గుండెకు స్కాన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కానీ శస్త్ర చికిత్స చాలా కఠినమైనది. పెద్ద రంధ్రాలు అని.. సర్జరీ కచ్చితంగా చేయాలన్నారు వైద్యులు. కానీ మూడు నెలల వయసులో శస్రచికిత్స చాలా కష్టమని.. కానీ చివరి వరకు సర్జరీ కోసం వెయిట్ చేసి అంగీకరించాము. ” అంటూ చెప్పుకొచ్చింది.

ANN TOP 10