AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గవర్నర్‌ అనుమానాలను నివృత్తి చేయాలి

ఆర్టీసీ విలీనాన్ని రాజకీయలకు వాడుకుంటున్నారు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఆర్టీసీ విలీనానికి సంబంధించి గవర్నర్ తమిళిసై కోరిన క్లారిటీ అంశాలను సీఏస్ (CS) ద్వారా ఇస్తే బెటర్ అని, గవర్నర్ సీఎస్‌ను పిలిచి వివరణ కోరవచ్చునని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆర్టీసీ విలీనాన్ని రాజకీయలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో గవర్నర్ మాట్లాడడం మంచిదేనని, కానీ సీఏస్‌తో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

గవర్నర్ అడ్డు చెప్పడం వల్లే ఆర్టీసీ విలీనం కావట్లేదనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) సృష్టిస్తున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటె సీఏస్‌ను రాజ్‌భవన్‌కు పంపించి గవర్నర్ అనుమానాలను నివృత్తి చేయాలని జీవన్ రెడ్డి అన్నారు. పెన్షన్ బెన్ ఫిట్, పే స్కేల్ ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఓల్డ్ పెన్షన్ స్కీంను ఆర్టీసీ కార్మికులకు కల్పించాలన్నారు. గవర్నర్ హైదరాబాద్‌లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అవసరం అయితే అసెంబ్లీ సమావేశాలను పొడిగించి ఆర్టీసీ బిల్లు ఆమోదించాలన్నారు. అలాగే ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ANN TOP 10