AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖమ్మంలో అటవీ సిబ్బందిపై దాడి..

ఖమ్మం: జిల్లాలోని కారేపల్లి మండలంలో అటవీ సిబ్బందిపై దాడి జరిగింది. పాటిమీదగుంపులోని అటవీ భూముల్లో అక్రమంగా స్థానికులు బోర్లు వేస్తున్నారని అడ్డుకునేందుకు అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అటవీ సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు.

ఇరు వర్గాల మధ్య వాదనలు గొడవకు దారి తీశాయి. అటవీ సిబ్బందిపై స్థానికులు, బీట్ ఆఫీసర్లపై దాడి చేశారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయాలకు గురైన అటవీ సిబ్బంది అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10