AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..

నగరంలోని మంగలహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగబోలి వద్ద ఉన్న ఓ ఫర్నీచర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోదాం నుంచి మంటలు, పొగ రావడంతో స్థానికులు మంగలహాట్ పోలీస్‌లకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి అసలు కారణం తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. సుమారు రూ.3 లక్షల ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అనుమానస్పద అగ్నిప్రమాదం కేసు నమోదు చేసుకొని మంగలహాట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ANN TOP 10