AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ముట్టడికి పలు సంఘాల యత్నం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు మొదలయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాతున్నాయి. అయితే అసెంబ్లీ బయట మాత్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఉదయం పలు సంఘాల నేతలు విడతల వారీగా వచ్చిన అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తొలుత అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నం చేశాయి. దీంతో కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్, ఇతర నేతలను అరెస్టు చేశారు. వరద బాధితులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. వరదల్లో చనిపోయిన వారికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇల్లు కోల్పోయిన వారికి రూ.20 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. శాసన సభ ముట్టడికి సెకండ్ ఎఎన్‌ఎంలు కూడా పిలుపునిచ్చారు. 16 ఏళ్లుగా పని చేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పలు జిల్లాల్లో ఆందోళన చేస్తున్న వారిని ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ ఫిషర్మెన్ నాయకులు, కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు, ఏఎన్‌ఎమ్ ఉద్యోగులు ఇలా పలు సంఘాల నేతలు విడతల వారీగా వచ్చి అసెంబ్లీని ముట్టడించాలని ప్రయత్నించారు. అయితే వచ్చిన వారిని వచ్చినట్టే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడించాలని ప్రయత్నించారు. ఉదయం అసెంబ్లీ వద్దకు చేరుకున్న ఎన్ఎన్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ముట్టడికి యత్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల హాస్టల్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న ఎన్‌ఎస్‌యూఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వరద బాధితులకు నష్టపరిహారం, నిరుద్యోగ భృతి, పెండింగ్ బకాయులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురు వెంకట్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

ANN TOP 10