AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభవార్త చెప్పారు. త్వరలోనే ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్(పీఆర్‌సీ)తో పాటు మధ్యంతర భృతిని ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలతో జరిగిన భేటీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 2వ పీఆర్సీ ని ఏర్పాటు చేసి, 2023 జూలై 1నుంచి అమలయ్యేలా ఏఆర్ ను ప్రకటించాలని ఉద్యోగులు కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఇవాళ లేదా రేపు అసెంబ్లీలో పీఆర్సీ కమిషన్ , మధ్యంతర భృతిపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ టీఎన్‌జీవోలు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల జారీ అంశాలపై వారితో మాట్లాడారు.. వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం.

సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు ఈ ప్రకటన చేశారు. త్వరలోనే పీఆర్సీతోపాటూ మధ్యంతర భృతి కూడా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని వెల్లడిచారు. అలాగే ఉద్యోగులకు మెరుగైన హెల్త్ కార్డు సదుపాయంను కల్పించాలని చూస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ తెలిపారు. అందువల్ల అసెంబ్లీలో పీఆర్సీ, మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేస్తారనే టీఎన్‌జీవో నాయకులు అనుకుంటున్నారు.

ANN TOP 10