ఫ్యాన్స్‌కు రష్మిక మందన్న బిగ్ షాక్
సినీ నటి రష్మిక మందన్న.. ఫ్యాన్స్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది. అతనితో నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందని కామెంట్ చేయడంతో అందరూ షాక్ గురయ్యారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆతర్వాత వరుస సినిమాలతో దుసుకుపోతుంది ఈ చిన్నది. అలాగే తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అలాగే పుష్ప సినిమాతో పాన్ ఇండియా మూవీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా రష్మిక బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి మూవీ ప్రమోషన్స్‌కు వెళ్ళింది. అక్కడ ఈ అమ్మడికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దాంతో ఆమె ఫన్నీగా రిప్లే ఇచ్చింది. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపొయింది. నేను నరుటోను పెళ్లి చేసుకున్నా.. అతనంటే నాకు చాలా ఇష్టం.. నా మనసంతా అతనే ఉన్నాడు అని తెలిపింది. నరుటో అంటే ఎనిమీ సిరీస్‌లోని ఒక పాత్ర. ఆ పాత్ర కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ చిన్నది కూడా నరుటో ఫ్యాన్ అని తెలిపింది. దాంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.









