తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ .. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించి ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు హత్తుకున్నారు. పదినిమిషాల పాటు ఇరువురు మాట్లాడుకున్నారు. హాలులోని అందరూ ఆసక్తిగా చూశారు.









