AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతులకు తీపికబురు.. నేటి నుంచి రుణమాఫీ..

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించి.. అన్నదాతలకు గుడ్‌న్యూస్ వినిపించింది. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచి తిరిగి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ.. నెలపదిహేను రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు.. రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఈ విషయంపై ప్రగతిభవన్‌లో బుధవారం రోజున సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.

ANN TOP 10