ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కృతజ్ఞతలు తెలిపారు. రైతు రుణమాఫీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం, గురువారం నుంచే అందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినందుకు ఎమ్మెల్యేలు బాల్కసుమన్, జీవన్‌రెడ్డిలతో కలిసి ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్‌కు మొక్క అందించి రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.









