AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదు

సుప్రీంకోర్టులో రాహుల్ అఫిడవిట్
న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో బుధవారం రిజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 63 పేజీల అఫిడివెట్‌లో రాహుల్.. ఈ కేసు ‘అసాధారణమైన కేటగిరి’ కిందకు రాదని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. తాను శిక్షార్హమైన ఎలాంటి నేరానికి పాల్పడలేదని, క్షమాపణే చెప్పాల్సి వస్తే అదే అతిపెద్ద శిక్ష అవుతుందని పేర్కొన్నారు. ఒక వేళ క్షమాపణే అయితే ఈ పాటికే చెప్పేవాడనని అన్నారు.

క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందునే పిటిషన్ పూర్ణేష్ మోదీ తనను ‘అహంకారి’గా పేర్కొన్నట్టు రాహుల్ తన అఫిడవిట్‌తో తెలిపారు. తాను ఏ నేరం చేయలేదని, అయినా ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద క్రిమినల్ నేరం మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. తనకు విధించిన శిక్షపై స్టే ఇవ్వాలని అఫిడవిట్‌లో కోరారు. తద్వారా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

ANN TOP 10