అనిఖా సురేంద్రన్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. తెలుగులో బుట్టబొమ్మ అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో హీరోయిన్గా నటించింది అనిఖా సురేంద్రన్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. హీరోయిన్ గా అనిఖా సురేంద్రన్ తన నటనతో ఆకట్టుకుంది. దాంతో ఈ అమ్మడికి వరుస సినిమా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. అనిఖా సురేంద్రన్ అందుకున్న బంపర్ ఆఫర్ ఏ హీరో సినిమాలోనో తెలుసా.. ధనుష్ సినిమా నుంచి ఛాన్స్ వచ్చిందట. ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
