ముంబయి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ఎయిర్ విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని సామాన్లను తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం ఇంజిన్ దెబ్బతింది. ప్రమాద సమయంలో విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వారికెవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం జరిగిందని చెప్పారు. ముంబయి నుంచి కోల్‌కతాకు నడిచే విమానం ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ఇంజిన్‌కు మరమ్మతులు చేశామని వెల్లడించారు. ‘ఆగస్టు 1న ముంబయి నుంచి కోల్‌కతాకు బయలుదేరిన విమానాన్ని సామాన్లు తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ఇంజిన్ దెబ్బతింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసి గమ్య స్థానాలకు తరలించాం. అదృష్టవశాత్తు ప్రయాణికులలెవరికి గాయాలు కాలేదు.’ అని విస్తార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ఉద్యోగి తెలిపారు.
